NTV Telugu Site icon

Kalki 2898 AD : ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. ట్రైలర్ వచ్చేస్తుంది..

Kalki

Kalki

Kalki 2898 AD :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Read Also :NBK 109 : మాన్‌స్టర్‌ వచ్చేసాడు.. బాలయ్య బర్త్ డే గ్లింప్స్ అదిరిపోయిందిగా..

దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.ఇప్పటికే సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి పాత్రను మేకర్స్ గ్రాండ్ గా పరిచయం చేసారు.ప్రస్తుతం బుజ్జి (రోబోటిక్ కార్ )ను మేకర్స్ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తిప్పుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమా ట్రైలర్ ను దేశవ్యాప్తంగా పలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ థియేటర్ లిస్ట్ ను అనౌన్స్ చేసారు.ఈ సినిమా ట్రైలర్ ను నేడు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.