కోలీవుడ్‌లో ఎక్స్ పరిమెంట్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్. సినిమాపై పిచ్చి, ఫ్యాషన్‌తో ఎలాంటి ప్రయోగాలకైనా రెడీ అయిపోతుంటాడు. కానీ సమ్ టైమ్స్ అవి శాడిస్పాక్షన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి కానీ గల్లాపెట్టి నింపలేకపోతున్నాయి. ఆ మధ్య వచ్చిన ఐ, తంగలాన్ వరకు సేమ్ రిజల్ట్. సోలో హీరోగా హిట్ చూసి చాలా కాలమే అయ్యింది చియాన్‌కు. పొన్నియన్ సెల్వన్ భారీ సక్సెస్… తన కో హీరోలతో షేర్ చేసుకున్నాడు వర్సటైల్ యాక్టర్.
Also Read : Balayya : బాలయ్య–కొరటాల కాంబోపై క్రేజీ బజ్.. మాస్ విధ్వంసమే
అనుభవమైతే కానీ తత్వం తెలిసి రాదని గ్రహించాడే ఏమో.. ప్రయోగాలు ఆపి.. గత ఏడాది నార్మల్ యాక్షన్ చిత్రాలకు షిఫ్టయ్యాడు. వీర ధీర శూరన్2తో ఓకే అనిపించుకున్నాడు. కానీ ఇది విక్రమ్ స్థాయి హిట్ కాదు. మళ్లీ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చియాన్ 63కి ఓ పట్టాన దర్శకుడు సెట్ కావట్లేదు. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ నుండి, మడోన్నా అశ్విన్ వరకు పేర్లు వినిపించాయి. కానీ బోడీ రాజ్ కుమార్ అనే కొత్త వ్యక్తికి టాక్ వచ్చింది.. కానీ చివరికి తనతో ఇరుమగన్ మూవీ తీసిన ఆనంద్ శంకర్ కు ఆ ఛాన్స్ దక్కింది. శివజ్యోతి బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కుతోంది. గత ఏడాది చియాన్ సన్ ధ్రువ్ విక్రమ్ బైసన్ మూవీతో తొలి సక్సెస్ అందుకున్నాడు. ఇక విక్రమ్ ఖాతాలోనే ఓ భారీ బ్లాక్ బస్టర్ పడితే.. దర్శకులు క్యూ కట్టుకుంటూ వస్తారు. ఇటీవల 60వ పడిలో పడిన చియాన్.. ఫిజిక్‌లో మాత్రం కొడుకుకు పోటీ ఇస్తూ.. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని ఫ్రూవ్ చేస్తున్నాడు.