గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లిహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ సింగర్ శ్రీలలిత. మొక్కలు నాటడం సంతోషంగా ఉంది..ప్రకృతి మనకు తల్లిలాంటిది అని అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు శ్రీలలిత.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అప్రతిహతంగా సాగిపోతోంది. సినీతారలు, సెలబ్రిటీలు ఎక్కువగా మొక్కలు నాటుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీ లలిత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతి మనకు తల్లిలాంటిది. అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని శ్రీ లలిత కోరారు. అనంతరం ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని సింగర్స్ షణ్ముఖ ప్రియ,రమ్య బెహ్రా,రాస్తా రామ్ ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.