NTV Telugu Site icon

Parusuram :ఫ్యామిలీ స్టార్ తరువాత ఊహించని హీరోను పట్టిన పరశురాం..

Parusuraam

Parusuraam

విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ ఆ తర్వాత కనిపించలేదు.. దాంతో సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు… థియేటర్లలో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది..

ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైమ్ లో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్ లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ వాళ్లు ట్వీట్స్ చేస్తున్నారు.. ఈ దెబ్బతో విజయ్ తో పాటు డైరెక్టర్ ట్రాక్ కూడా మారిపోయింది.. ప్రస్తుతం వీరిద్దరూ తర్వాత సినిమాల పై ఫోకస్ పెట్టారు.. డైరెక్టర్ పరుశురాం ఎవ్వరు ఊహించలేని విధంగా హీరో రామ్ పోతినేని తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు..

అంతే అతనికోసం ఒక కథను కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది.. ఆ కథను హీరోకు వినిపించాడని, ప్రస్తుతం ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్.. విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ తో సినిమాలు తీసిన డైరెక్టర్ ఇలా రామ్ లాంటి హీరోను సెలెక్ట్ చేసుకోవడం పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో రామ్ లవర్ బాయ్ గా కనిపించవచ్చునని తెలుస్తుంది. త్వరలోనే ఈ కొత్త సినిమా అనౌన్స్మెంట్ రాబోతుంది.. ఇక రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది..