Family Star : భారీ ధరకు సేల్ అయిన ఫ్యామిలీ స్టార్ ఓటిటి రైట్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన గీతగోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు భారీగా వున్నాయి. ఇదిలా ఉంటే ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలిసింది. సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు మంచి రేటు వచ్చిందట.’ఫ్యామిలీ స్టార్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం.ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో ‘ఫ్యామిలీ స్టార్’ థియేట్రికల్ బిజినెస్ మీద ‘దిల్’ రాజు దృష్టి పెట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 54వ చిత్రంగా ఫ్యామిలీ స్టార్ మూవీ తెరకెక్కింది.. సోదరుడు శిరీష్ తో కలిసి దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
అయితే ‘దిల్’ రాజుకు పర్మినెంట్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగతా ఏరియాలను రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారు. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకూ సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారని సమాచారం.. థియేట్రికల్ బిజినెస్ ద్వారా సుమారు 50 కోట్లు రావాలని ‘దిల్’ రాజు ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను ముందు సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పండగ బరిలో ఎక్కువ సినిమాలు ఉండటం, అందులో ‘గుంటూరు కారం’ వంటి భారీ సినిమాను ‘దిల్’ రాజు డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఈ సినిమాను వాయిదా వేశారు.. అలాగే ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ రిలీజ్ డేట్ వెనక్కి వెళ్లడంతో ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలోకి వస్తోంది.ఇప్పటికే విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ సాంగ్స్ కీ కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి.గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!