NTV Telugu Site icon

Dulam Nageswara Rao: వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చిన్న కోడలు ఇంటింటి ప్రచారం..

Dulam Swathi

Dulam Swathi

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు సమయం వృధా చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. మద్ధతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఓ పక్క ప్రచారంలో దూసుకెళ్తుండగా.. మరోపక్క తన చిన్న కోడలు స్వాతి గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ముదినేపల్లి మండలం వాడాలి గ్రామంలో స్వాతి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి జగనన్న చేసిన మంచి పనులను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

Car Sales In April 2024 : ఏప్రిల్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు..

ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. వాడాలి గ్రామంలో ప్రచారం చేస్తుంటే మహిళలు స్పందన బాగుందని, మహిళలు ముందుకొచ్చి దూలం నాగేశ్వరావు ఆశీర్వాదిస్తామని అంటున్నారని తెలిపారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయమని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. ఒక ఓటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ కు మరో ఓటు దూలం నాగేశ్వరరావుకు వేయమని ప్రచారం చేశామన్నారు.

YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీత, బీటెక్ రవికి చుక్కెదురు.. రూ.10వేల ఫైన్‌ విధింపు

మరోవైపు.. ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాలు అందుకున్నారని చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది అందుకున్నారని.. అవ్వా తాతలు అయితే మా బిడ్డ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తామంతా స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వెంట ఉండి.. రెండోసారి ఎమ్మెల్యే గాను, జగన్మోహన్ రెడ్డిని సీఎం గాను చేసుకుంటామని చెప్పారన్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రచారం వేగవంతం చేశామని తెలిపారు