Site icon NTV Telugu

Rohit : ఫ్యామిలీ మ్యాన్ 3 నటుడి అనుమానాస్పద మృతి

Fm 3

Fm 3

బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. టాలీవుడ్ నటి సమంత ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. రెండు భాగాలు సూపర్ హిట్ కాగా  ‘ఫ్యామిలీ మ్యాన్‌ 3’ వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. రోహిత్‌ బస్ఫోర్‌ అనే బాలీవుడ్ నటుడు ఫ్యామిలీ మ్యాన్‌ 3 లో నటించాడు. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో నటించిన రోహిత్‌ బస్ఫోర్‌ ఉన్నట్టుండి శవమై కనిపించాడు. ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహన్నీ గుర్తించారు.

Also Read : VT 15 : కొరియన్ కనకరాజ్ కోసం కసక్ బ్యూటీ

ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటుడు రోహిత్‌ కొన్ని నెలల క్రితం  ముంబయి నుంచి గౌహతి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్లారు. అయితే ఆరోజు సాయంత్రం నుంచి  ఎన్ని సార్లు కాల్ చేసిన తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాలించగా అస్సాంలోని ఓ జలపాతం వద్ద రోహిత్‌ మృతదేహాన్ని గుర్తించారు.  ఇటీవల ఓ పార్కింగ్‌ విషయంలో రోహిత్‌ ముగ్గురు వ్యక్తులతో గొడవ పడ్డాడని, అప్పటి నుండి రోహిత్ పై కక్ష పెంచుకుని వారే హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. రోహిత్ ముఖం, తల, ఇతర భాగాలపై గాయాలు కనిపించాయని కేసును దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలిసులు తెలిపారు.

Exit mobile version