NTV Telugu Site icon

Fake Whatsapp: ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ అలీ పేరుతో నకిలీ వాట్సాప్

Ias Musharaf Ali

Ias Musharaf Ali

Fake Whatsapp: ప్రముఖుల పేర్లతో ఖాతాలు సృష్టిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నిర్మల్, నారాయణపేట పాలనాధికారుల పేరుతో మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరగాళ్లు.. తాజాగా.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ అలీ పేరుతో నకిలీ వాట్సాప్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు.. తన అకౌంట్‌కు డబ్బులు పంపాలని.. జిల్లాలోని పలువురు ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి మెసేజ్‌లు పెట్టారు.

Read Also: Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

ముష్రాఫ్ అలీ ఫోటోను డీపీగా పెట్టారు ఆ కేటుగాళ్లు. సీఎండీ ముష్రాఫ్ అలీ ఛాటింగ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు, ఉద్యోగులకు వాట్సాప్ మెసేజ్‌లు పంపారు. ఆనోటా.. ఈ నోటా ఈ విషయం ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ అలీ తెలిసింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ వాట్సప్ విషయం తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేశారు ముష్రాఫ్ అలీ. తన పేరుతో వచ్చే సందేశాలకు ఎవరూ స్పందించొద్దని.. ఎవరూ డబ్బులు పంపకూడదని సూచించారు. గతంలో కూడా అనేక మంది అధికారులు సైబర్ నేరాల బారిన పడ్డారు. గతంలో నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా ముషారప్ అలీ ఫారూఖీ పేరు, ఫోటోతో వాట్సాప్‌ ప్రొపైల్ సూచించే నెంబర్‌ నుంచి పలువురు అధికారులకు, ఇతరులకు మేసేజ్‌‌లు వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది.