Fake Liquor Case: నకిలీ మద్యం కేసుకి సంబంధించిన మూలాలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. కేసులో ఏవన్‌గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్ధన్‌కి సంబంధించిన గోడౌన్‌లో పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచినటువంటి స్పిరిట్ అదే విధంగా ఖాళీ బాటిల్‌లను అధికారులు సీజ్ చేశారు. వీటితోపాటు ఇప్పటికే కొంత మద్యాన్ని తయారు చేసినట్లు గుర్తించి ఆ బాటిల్స్ ని కూడా సీజ్ చేశారు. కేసులో ఏ వన్‌గా జనార్ధన్ ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జనార్ధన్ సోదరుడు జగన్‌తో పాటు రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంశాన్ని గుర్తించి అక్కడ విచారణ చేపట్టగా 32 క్యాన్లలో ఉన్నటువంటి స్పిరిట్ ని కూడా సీజ్ చేశారు. ఇక్కడ రెండు బ్రాండ్లకు సంబంధించిన స్టిక్కర్లను కూడా గుర్తించారు. ఇక్కడ నుంచి మద్యం వేరే ప్రాంతాలకు ఇంకా వెళ్ళలేదని తయారీ చేసి సిద్ధంగా పెట్టుకొని రా మెటీరియల్ కూడా ఉంచుకున్నట్టుగా అధికారులు తెలిపారు.
READ MORE: Pawan Kalyan Tour: రాష్ట్రవ్యాప్త పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్ధం.. ఫస్ట్ ఆ జిల్లాకే…
నకిలీ లిక్కర్ తయారీ కేసుపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ చేసింది. నకిలీ మద్యం తయారీలో స్పిరిట్ కీలకమని అధికారులు చెబుతున్నారు. స్పిరిట్ ను నకిలీ మద్యం తయారీ దారులకు అమ్మిన వారిని గుర్తించటంపై దృష్టి పెట్టారు. మద్యం తయారీ కోసం రిక్టిఫైడ్ స్పిరిట్ (RS), ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ENA) ను వినియోగిస్తారని చెబుతున్నారు. చీప్ లిక్కర్ కాబట్టి రెక్తిఫైడ్ స్పిరిట్ ను నకిలీ మద్యం కోసం వాడినట్టు గుర్తించారు. స్పిరిట్ ను అమ్మిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఒక్కో బాటిల్ ను రూ. 120 నుంచి రూ. 130 వరకు ధర ముద్రించినట్లు తెలిపారు.
