NTV Telugu Site icon

Fake Doctors : మరోసారి నకిలీ వైద్యుల భరతం పట్టిన తెలంగాణ వైద్య మండలి

Doctors

Doctors

తెలంగాణ వైద్య మండలి మరోసారి నకిలీ వైద్యుల భరతం పట్టింది. బుధవారం నాడు హైదరాబాద్ మహానగరం లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కిన్, లేజర్ , కాస్మెటలజీ సెంటర్స్ పైన ఏక కాలంలో 5 బృందలుగా ఏర్పడి జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాధపూర్ , హైటెక్ సిటీ, కూకట్ పల్లి , మియాపూర్ ప్రాంతా ల్లో మొత్తం 40 సెంటర్స్ పై తనిఖీ నిర్వహించారు. ఇందులో ముగ్గురు నకిలీ వైద్యులను గుర్తించి FIR ఫైల్ చేయనున్నట్లు , మరో 20 సెంటర్స్ లో చర్మ వ్యాధి నిపుణులు , ప్లాస్టిక్ సర్జన్స్ లేకుండా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అనుమతి లేకుండా లేజర్స్ వినియోగిస్తున్న తమ విద్యార్హత కానీ వైద్యం చేస్తున్న డెంటల్,. ఆయుర్వేదిక్, హోమియోపతి వైద్యులకి నోటీసు లు ఇవ్వడం తో పాటు వారి కౌన్సిల్ కి కూడా వారి పైన తీసుకునే చర్యలకు నిర్ణయం తెలియ చేయాలనీ లేఖ రాయనున్నామని టీజీఎంసీ చైర్మన్ డా మహేష్ కుమార్ తెలియచేసారు.
MP: ఉమెన్స్ షెల్టర్ హోమ్‌లోకి యువకులు ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

NMC మార్గదర్శకాల ప్రకారం కాస్మెటలజీ , లేజర్ , PRP థెరపీ, హెయిర్ ట్రాన్సప్లాంటేషన్ లాంటి చికిత్సలు డెర్మటాలజీ , ప్లాస్టిక్ సర్జరీ వైద్య విద్య చదివిన డాక్టర్లు మాత్రమే నిర్వహించాలని వేరే విద్య చదివి లేజర్ కాస్మెటలజీ చికిత్స చేసే మిగతా అర్హత లేని వారిపైన కూడా NMC చట్ట ప్రకారం చర్యలు తీస్కుంటామని వైస్ చైర్మన్ డా.శ్రీనివాస్ తెలియచేశారు.

ఇప్పటికి అయినా అర్హత లేని నకిలీ వైద్యులు తమ ఫరిదికి మించి వైద్యం చేసి ప్రజల ఆరోగ్యం ఆడుకోవడం మానుకోవాలని, పలు అసోసియేషన్ ల ద్వారా గ్రామీణ ప్రాంతల్లో వైద్యo పేరుతో 70 శాతం అర్హత లేని నకిలీ వైద్యులు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలను, ప్రభుత్వాలను ప్రక్కతోవ పట్టించే మోసపూరిత ప్రకటనలు ఆపాలని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ హెచ్చరించారు. ఈ తనిఖీ లలో టీజీఎంసీ సభ్యులు డా ఆనంద్, డా విష్ణు, డా ఇమ్రాన్ అలీ , డా సన్నీ డేవిస్, co opt మెంబెర్స్ డా విజయ్, డా ఫణి ,డా రాజీవ్ చర్మ వైద్య నిపుణులు డా మౌనిక లు పాల్గొన్నారు.

Amritpal Singh: ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు.. బీజేపీ ఆగ్రహం