NTV Telugu Site icon

Fake Currency : నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

Digital Arrest

Digital Arrest

Fake Currency : హనుమకొండ జిల్లాలో నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక లక్షకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల విక్రయాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను కేయూసి పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు వోట్లు 34లక్షల 84వేల రూపాయలతో పాటు, 21లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, ఒక కారు, ఆటో, తొమ్మిది సెల్ఫోన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో:

1) మణికాల కృష్ణ, 57 సంవత్సరాలు, గ్రామం మోరంపల్లి బంజర గ్రామం, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

2) ఎర్రగొల్ల శ్రీనివాస్ 36 సంవత్సరాలు,కేశవాపూర్ గ్రామం, ఎలుకుర్తి మండలం, హనుమకొండ జిల్లా.

3) బిజిని వేముల వెంకటయ్య, 57 సంవత్సరాలు, కుర్వపేట, వేల్పనూరు గ్రామం, కర్నూలు జిల్లా,

4) దరామ్సోత్ శ్రీను,45 సంవత్సరాలు, నక్రిపేట తండా బుర్గాంపాడ్ మండల్, భద్రాద్రి కొఠాగుడెం జిల్లా,

5) తేజావత్ శివ,34 సంవత్సరాలు, నక్రిపేట తండ బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

6) గుగ్గోత్ వీరన్న 26 సంవత్సరాలు, ముకమామిడి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం.

7) ఉడుతా మల్లేష్, 26 సంవత్సరాలు,, కేశవాపూర్ గ్రామం, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా.

8) ఎర్రగొల్ల అజయ్, 25 సంవత్సరాలు, పెద్దపాపయ్యపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం ఇప్పుడు ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామం, హనుమకొండ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

India vs England 2nd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..