NTV Telugu Site icon

Fake Seeds: భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

Fake Seeds

Fake Seeds

Fake Seeds: లాభాపేక్ష కోసం కొంత మంది నకిలీ విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ విత్తనాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డిమందును విక్రయిస్తున్న మరో నిందితుడితో కలిపి టాస్క్‌ఫోర్స్‌, సంగెం పోలీసులు సంయుక్తంగా కల్సి ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా..మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. వర్షాకాలం సీజన్‌లో అమ్మకానికి ఉన్న సుమారు పది లక్షల విలువైన 310 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, రెండు సెల్‌ఫోన్లు, లక్ష పది వేల రూపాయల విలువగల 122 లీటర్ల నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Illegal Sale of Ganja: గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్టు.. 1.57కిలోల సరుకు పట్టివేత

వరంగల్‌ జిల్లా సంగెం మండలం గాంధీనగర్‌కు చెందిన నిందితుడు కోడూరి శ్రీనివాస్‌రావు తనకు వరసకు మామ ఆయిన సూర్యాపేట జిల్లాతిరుమలగిరి ప్రాంతానికి చెందిన నాగమల్లేశ్వర్‌ రావుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌,కర్ణాటక,మహరాష్ట్ర రాష్ట్రాలకు భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. శ్రీనివాస్ రావు,నాగమల్లేశ్వర్ ఇద్దరు కలిసి గుంటూరు జిల్లా పెద్దకూరపాడుకు చెందిన ఏటుకూరి సుబ్బరావు వద్ద పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కోనుగోలు చేశారు. నిందితులు కోనుగోలు చేసిన ఈ విత్తనాలు గ్లైసెట్ గడ్డి మందుకు తట్టుకోనే శక్తి కలిగి ఉందంటూ పత్తి దిగుబడి అధికమని, ఎక్కువమార్లు కలుపు తీయాల్సిన అవసరం లేదని, మాయమాటలు చెబుతూ రైతులను నమ్మించి నకిలీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరకు వియ్రించేందుకు నిందితుడు శ్రీనివాస్‌రావు తన ఇంటి వద్ద నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకుగా ఉండగా, పోలీసులకు అందిన పక్కా సమాచారంతో అధికారులు దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్‌,సంగెం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి విక్రయాలకు సిద్దంగా వున్న నకిలీ పత్తి విత్తనాలతో పాటు, ప్రభుత్వ నిషేధిత 50 లీటర్ల గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకోని నిందితుడు శ్రీనివాస్‌రావును అదుపులోకి తీసుకున్నారు. మరో సంఘటనలో సంగెం మండలం, తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన మెంతుల రాజేష్‌ ప్రభుత్వం పూర్తి నిషేధించిన గడ్డి మందుకు ఇంటి వద్ద అక్రమంగా విక్రయిస్తున్నట్లుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితుడి ఇంటిలో తనీఖీ చేయగా 72లీటర్ల గడ్డిమందును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అన్నదాతను నమ్మించి మోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించినా, సరఫరా చేసినా వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే 8712685070 వాట్సప్‌ నంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

.

Show comments