Site icon NTV Telugu

Adilabad : భారీ స్కామ్.. నకిలీ సర్టిఫికెట్స్‌తో ఆర్మీ ఉద్యోగాలు.. చివరికీ…

Fake Education Certificates

Fake Education Certificates

నకిలీ ధృవపత్రాలతో ఆర్మీ ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేక్ సర్టిఫికేట్స్ తో ఆర్మీ ఉద్యోగాలంటూ ఎన్టీవీలో వచ్చిన వరుస కథనాలపై పోలీసుల విచారణ ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనలో ముగ్గురి పై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సూరజ్ సహాని, గజేంద్రా, దిగ్విజయ్‌పై కేసు నమోదైంది. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ లో కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్లు దరఖాస్తు చేశారు. ఆర్మీ ఉద్యోగాలకు నివాస ధృవ పత్రాలు నకిలీవి ఇచ్చినట్లుగా గుర్తించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో పోలీసులు పూర్తి స్థాయి డేటాను సేకరిస్తున్నారు.

READ MORE: Menstrual Problems: రుతుక్రమం సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

ఎవ్వరు అప్లై చేశారు.. ఏ మీ సేవలో దరఖాస్తు చేశారు అనే కోణంలో విచారణ జరిపారు. రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు. ఒక్క ఇచ్చోడ లోనే కాదు రాష్ట్రంలోని వివిధ మీ సేవ కేంద్రాలను నుంచి వచ్చిన దరఖాస్తులు చేసినట్లు తేలింది. నిజామాబాద్ జిల్లా మునిపల్లి ఏరియాలో ఓ మీసేవ తోపాటు పలు మీ సేవ సెంటర్ల నుంచి ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌లో నివాసం ఉన్నట్లుగా ధృవ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల రిజెక్ట్ అయిన దరఖాస్తుల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు సూరజ్ సహాని, గజేంద్రా, దిగ్విజయ్‌ ఉత్తరప్రదేశ్‌లో చదివి ఇక్కడ నివాస ధృవ పత్రాలు కోసం దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు జారీ చేయలేదని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

READ MORE: Menstrual Problems: రుతుక్రమం సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

Exit mobile version