Fake Babas Gang: దుండిగల్ ప్రాంతంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దొంగ బాబాల అవతారమెత్తి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని చూసిన ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తూ, ఆ తర్వాత మత్తుమందు చల్లి అపస్మారక స్థితిలో ఉన్న వారి నుంచి నగదు దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ వ్యక్తి దొంగ ‘బాబా’ అవతారం ఎత్తి, తన ముఠాతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. వీరు అమాయకులను లక్ష్యం చేసుకుని, వారి సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి పూజల పేరుతో ఇళ్లకు వెళ్లేవారు. పూజ సాకుతో మత్తుమందు చల్లి బాధితులు అపస్మారక స్థితికి చేరుకోగానే.. వారి వద్ద ఉన్న నగదును ఉడాయించడం ఈ ముఠా పద్ధతి.
Adluri Lakshman: కవిత ఆరోపణలకు సమధానమేది?.. హరీశ్‌రావుపై మంత్రి లక్ష్మణ్ ఆగ్రహం
ఈ దొంగ బాబాల బాగోతంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే, ముఠాలో ఉన్న మరొకరు పరారీలో ఉన్నారు. పోలీసులు ఈ ముఠా నుంచి కీలక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల కోసం మాయమాటలు, మత్తుమందులు, ఆఖరికి బెదిరింపులకు కూడా సిద్ధపడిన ఈ ముఠా భరతం పట్టడంతో దుండిగల్ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
MSVG: నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ కవర్ చేసిన చిరంజీవి సినిమా!
