NTV Telugu Site icon

Fahad Faasil : ఓటీటీలపై ఫహాద్ ఫాజిల్‌ సంచలన వ్యాఖ్యలు..

Fahad

Fahad

ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో మంచి గుర్తింపును పొందాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. రెండు వారాల్లోనే ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది.. ఇప్పటికి సినిమా జోరు తగ్గలేదు..

ఈ సినిమా సక్సెస్ అయిన సందర్బంగా ఈ హీరో ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఇందులో భాగంగా ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు.. తన సినీ జీవితం గురించి మాత్రమే కాదు ప్రస్తుతం సినిమాల పరిస్థితుల గురించి వివరించాడు.. సినిమానే జీవితం కాదు.. జీవితంలో ఎన్నో నేర్చుకోవాలి.. ఎన్నో చెయ్యాల్సినవి ఉన్నాయి అని ఆయన చెప్పాడు.. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మమ్మల్ని పట్టించుకోకండి.

ఇక సినిమాని కూడా ఓ హద్దులో ఉంచాలి. సినిమాలు చూడటమే మన లైఫ్ కాదు కదా అని సంచలన వ్యాఖ్యలు చేసారు.. అంతేకాదు.. మలయాళ సినిమాలకు వాణిజ్య పరంగా డిమాండ్ పెరిగింది.. కానీ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి మాకు ఇంకా గట్టి మద్దతు లేదు. దాదాపు 80% ఫిలింలు ముందుగా పటిష్టంగా ఉన్న భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా, మాకు విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏదైనా ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కాస్త ఎక్కువగా ప్రమోట్ చెయ్యడం వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..