Faf du Plessis Skipper Takes Sensational Catch to Dismiss Tim David in MLC 2023: మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్ఎల్‌సీ) 2023లో టెక్సస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సూపర్ డైవ్‌తో బంతిని అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఫీట్స్ చేస్తూ తన ఫిట్‌నెస్ ఏ రేంజ్‌లో ఉందో నిరూపించుకుంటున్నాడు. ఎమ్ఎల్‌సీ 2023లో భాగంగా మంగళవారం ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ సూపర్ ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
చివరి ఓవర్లో ముంబై న్యూయార్క్ విజయానికి 21 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో హిట్టర్ టీమ్ డేవిడ్ ఉండడంతో న్యూయార్క్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. అయితే డానియల్ సామ్స్ వేసిన తొలి బంతిని డేవిడ్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ నుంచి పరుగెత్తుకొచ్చిన ఫాఫ్ డుప్లెసిస్.. డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. కిందపడినా కూడా ఫాఫ్ బంతిని మాత్రం వదలలేదు. దాంతో టీమ్ డేవిడ్ (24) పెవిలియన్ చేరాడు. టెక్సాస్ టీమ్ ఆనందంలో మునిగిపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 రన్స్ చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (74; 55 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ ఒంటరి పోరాటం చేశాడు. మిగతా టెక్సాస్ బ్యాటర్లు విఫలమయ్యారు. మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే చివరలో మెరుపులు మెరిపించాడు. ముంబై న్యూయార్క్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, కాగిసో రబాడలు చెరో రెండు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ షయాన్ జాహంగీర్ (41) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివరలో టిమ్ డేవిడ్ 24 పరుగులు చేశాడు. టెక్సస్ సూపర్ కింగ్స్ బౌలర్లలో మహ్మద్ మోషిన్, డేనియల్ సామ్స్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫాఫ్ డుప్లెసిస్ పట్టిన సెన్సేషనల్ క్యాచ్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
Also Read: Bigg Boss 7: బిగ్‌బాస్-7లోకి కంటెస్టెంట్‌గా టీమిండియా క్రికెటర్?
FAF TAKES A BLINDER! 🫣
Is that the game? pic.twitter.com/oPn4m2fo7x
— Major League Cricket (@MLCricket) July 18, 2023