ఏ దేవాలయాన్ని చూసినా భగవంతుని నామస్మరణతో ప్రశాంతంగా మారుమ్రోగుతుంది. దేవాలయాలలో ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. కానీ మెహందీపూర్ బాలాజీ ఆలయం అలా కాదు. అక్కడ అడుగు పెట్టాలంటే ఒళ్ళు జలదరిస్తుంది. అక్కడికి వెళ్తే వణుకు పుడుతుంది. తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఆలయాలు ఇలా ఉంటాయా అనే సందేహం కలుగుతుంది. అక్కడ వారు అనుసరిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను చూసి ముక్కున వేలేసుకుంటారు. అది అక్కడి భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇది దుష్టశక్తులను పారద్రోలే ఆలయంగా పేరుగాంచింది.
Read also: Ram potineni: ఆర్టీసీ క్రాస్ రోడ్ లో..మార్ ముంత చోడ్ చింత..
అటువంటి దేవాలయాలలో ఒకటి రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో కొలువైన మహేందిపూర్ బాలాజీ దేవాలయం. మహేందిపూర్ బాలాజీ ఆలయంలో బాలుడి రూపంలో హనుమంతుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఛాతీ మధ్యలో ఒక రంధ్రం ఉంది..దాని నుండి నిరంతరం నీరు వస్తూ ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత వారం రోజుల పాటు గుడ్లు, మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మానుకోవాలని చెబుతారు. ఇక్కడ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి కాదు ఆంజనేయుడు. భూతాలను వదిలించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శరీరంపై వేడినీరు పోయడం, పైకప్పుకు వేలాడదీయడం, తలను గోడలకు కొట్టడం మరియు శరీరాన్ని తాళ్లతో కట్టడం వంటివి దుష్టశక్తులను తరిమికొట్టడం. ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ బాలాజీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని స్వయంగా విహరిస్తున్నారు.
Read also: Weather Warnings: నేడు, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు.. 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు
ఈ దేవాలయం గురించి తెలిసిన వారు బాగానే ఉన్నారు, కాని తెలియని వారు, ఈ ఆలయాన్ని మొదటిసారి సందర్శించాలనుకునే వారు ముందుగా మానసికంగా సిద్ధం కావాలి. ఎందుకంటే ఆ ఆలయంలోని ప్రదేశం అంతా దుష్ట శక్తులతో చాలా భయంకరంగా ఉంటుంది. రాజస్థాన్‌లోని వారే కాదు..దేశవ్యాప్తంగా దుష్టశక్తులు, తంత్రాలతో బాధపడుతున్న చాలా మంది ఈ ఆలయానికి వచ్చి ఆంజనేయుడి దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయం మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఇది చాలా ప్రజాదరణ పొందింది. భూతదోషం పోగొట్టే బాలాజీ హనుమంతుడిని దర్శించుకుంటారు. మంత్ర శక్తులను పోగొట్టే బాలాజీ గురించి పరిశోధన చేసేందుకు జర్మనీ, నెదర్లాండ్స్, న్యూఢిల్లీ నుంచి 2013లో కొందరు శాస్త్రవేత్తలు ఈ ఆలయానికి వచ్చి ఈ స్వామిపై, ఇక్కడి ఆలయంపై, ఇక్కడి వాతావరణంపై పరిశోధనలు చేశారంటా కానీ ఎటువంటి ఆధారాలు వారికి దొరకలేదు. దీంతో ఇది ఒక మిష్టరీగానే మారింది.
Read also: Road Accident : మధ్యప్రదేశ్‌లో కారు, ట్రక్కు ఢీ – ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
వెనక్కి తిరిగి చూస్తే అంతే!
ఏదైనా ఆలయానికి వెళ్లిన తర్వాత దర్శనం, పూజల అనంతరం ప్రసాదం తీసుకుంటారు. వారు వెళ్ళేటప్పుడు, వారు వెనక్కి తిరిగి దర్శనానికి రావాలని వేడుకుంటారు. కానీ మహేందిపూర్ బాలాజీ ఆలయంలో మాత్రం ప్రసాదం ఇవ్వరు. అంతేకాదు దర్శనం తర్వాత వెనుదిరిగి చూడకూడదు. అలా చూస్తే దెయ్యాలను తమలోకి ఆవహిస్తాయని పురోహితులు హెచ్చరిస్తున్నారు. వెకిలి చేష్టలు చేసుకుంటూ నిజమా అపద్దామా అని వెనిక్కి తిరిగి చూసారో మీలో దెయ్యాలు ఆవహించాయని మీరే గ్రహించలేరు. మళ్లీ ఈ గుడికి రావాల్సి ఉంటుందని మర్చిపోకండి అంటూ హెచ్చరిస్తుంటారు.
Read also: Liquoe Parties: దావత్‌లపై ఆబ్కారీశాఖ ఫోకస్.. రాష్ట్రంలోని లిక్కర్ మాత్రమే అనుమతి..
ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే ఈ నియమాలు పాటించాలి
* భక్తులు ఈ ఆలయానికి రావాలంటే మాంసం, మద్యం అస్సలు తీసుకోకూడదు.
* దెయ్యాల బారిన పడిన వారు ఈ ఆలయంలోని ప్రత్యేక స్థలంలో పూజలు చేసిన తర్వాత ఒంటరిగా విడిచిపెడతారు.
* ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఎవరూ ఇంటికి తీసుకెళ్లకూడదు. ప్రసాదం మొత్తం ఈ ఆలయ ప్రాంగణంలోనే సేవించాలి.
* ఇక్కడి నుంచి ఎవరైనా తమ ఇళ్లకు ప్రసాదాన్ని తీసుకెళ్తే కీడు జరుగుతుందని భక్తుల విశ్వాసం.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
Puri Jagannath Temple: ఈ రోజు మధ్యాహ్నం తెరచుకోనున్న పూరీ రత్న భాండాగారం తలుపులు