Site icon NTV Telugu

MEAL FACILITY FOR FARMERS : మార్కట్ యార్డుల్లో రైతన్నలకు భోజనం.. కేవలం రూ. 5 మాత్రమే..!

5rupees Food

5rupees Food

వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు ఐదు రూపాయలకే భోజన సౌకర్యం కల్పించాలనా తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. దీనిక సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనుంది. రాష్ట్రంలో 192 ప్రధాన మార్కెట్ యార్డులు, 87 సబ్ యార్డులలో వీటన్నింటికీ కలిపి సీజయ్ సమయంలో రోజూ దాదాపుగా 8 వేల నుంచి 10 వేల మంది వస్తుంటారు. మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం భోజన సౌకర్యాలు లేవు. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను తీసుకొచ్చి రైతులు రోజంతా యార్డులోనే ఉంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. దీంతో యార్డుకి దగ్గరల్లో ఉన్న క్యాంటీన్లు, హోటళ్లకు వెళ్లి భోజనాలు చేస్తారు.

Also Read : Gold Smuggling : బంగారం బీరు బాటిళ్లలో పెట్టావు బాగానే ఉంది.. కానీ

అధికశాతం యార్డుల్లో మంచినీటి వసతి కూడా లేకపోవడంతో రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. అందువల్ల రైతులకు రాయితీపై, భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నజర్ పెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ పథకం ద్వారా పట్టణాలు, నగరాల ఆస్పత్రుల్లో సహాయకుల కోసం రూ. 5 కి భోజనం అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ. 21 రాయితీ చెల్లిస్తోంది. ఈ పథకాన్ని మార్కెట్ యార్డులకూ విస్తరించాలని భావిస్తోంది. 36 రైతు బజార్లో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది రైతులకు భోజన సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.

Also Read : KS Eshwarappa: అల్లా ఏమైనా చెవిటివాడా.. ‘అజాన్’పై బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా 36 రైతు బజార్లు ఉన్నాయి.. వీటికి వేయి మందికి పైగా రైతులు కూరగాయలు తెస్తున్నారు. రైతు బజార్లలోనూ భోజన వసతుల్లేవు. అక్కడ కూడా ఐదు రూపాయలకు భోజన సౌకర్యం కల్పించనున్నారు. అయితే ఈ పథకానికి ప్రభుత్వం నుంచే కాకుండా.. దాతలు, వ్యాపార సంఘాల వారు, స్వచ్చంద సంస్థల అధికారులు, ఛైర్మన్లు భోజన వసతి కల్పించేందుకు ముందుకు వస్తే వారికీ అవకాశం కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. మిగిలిన యార్డుల్లోనూ దాతలు ఎవరైనా పూర్తి ఖర్చు భరించేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల ఆధ్వర్యంలోనూ ఈ పథకాన్ని ప్రారంభించాలని సర్కార్ భావిస్తోంది.

Exit mobile version