Facebook Fraud: ఎఫ్‌బీలో లవ్.. పెళ్లి పేరుతో రూ.12 లక్షలు నొక్కేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facebook Fraud: సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై గట్టిగానే ఉంది.. ఎల్లలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులను పరిచయం చేస్తుంది.. అందేకాదు.. సోషల్ మీడియా వేదికగా మోసాలు కూడా పెద్ద సంఖ్యలు జరుగుతున్నాయి.. కొందరు మౌనంగా ఉండిపోతే.. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సోషల్ మీడియా వేదికగా జరిగిన మోసాలు వెలుగు చూస్తున్నాయి.. తాజాగా, గుంటూరులో మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది.. ప్రేమ -పెళ్లి పేరుతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశారు గుంటూరుకు చెందిన గురు ప్రసాద్ అనే వ్యక్తి..
Read Also: Bombay High Court: బక్రీద్ సందర్భంగా అనుమతి లేకుండా జంతువులను బలి ఇవ్వకూడదు..
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో వీరి పరిచయం మొదలైంది.. తాను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నానంటూ సదరు యువతితో మాటలు కలిపాడు గురుప్రసాద్.. అలా వారి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.. కంత్రీ మైండ్‌తో ఉన్న గురుప్రసాద్.. తన ప్లాన్ ప్రకారం.. పెళ్లి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.. త్వరలోనే పెళ్లి చేసుకుందామని నమ్మించాడు.. యువతి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండడంతో.. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయితే.. బాగానే ఉంటుందని నమ్మింది.. ఇక, ఆ యువతి నుంచి దాదాపు రూ.12 లక్షల వరకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొఖం చాటేశాడు.. తాను మోసపోయినట్టు గుర్తించిన యువతి.. ఈ ఘటనపై అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గురు ప్రసాద్ కు ఇప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.