NTV Telugu Site icon

Facebook Fraud: ఎఫ్‌బీలో లవ్.. పెళ్లి పేరుతో రూ.12 లక్షలు నొక్కేశాడు..!

Fraud

Fraud

Facebook Fraud: సోషల్‌ మీడియా ప్రభావం ప్రజలపై గట్టిగానే ఉంది.. ఎల్లలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులను పరిచయం చేస్తుంది.. అందేకాదు.. సోషల్‌ మీడియా వేదికగా మోసాలు కూడా పెద్ద సంఖ్యలు జరుగుతున్నాయి.. కొందరు మౌనంగా ఉండిపోతే.. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సోషల్‌ మీడియా వేదికగా జరిగిన మోసాలు వెలుగు చూస్తున్నాయి.. తాజాగా, గుంటూరులో మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది.. ప్రేమ -పెళ్లి పేరుతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువతి నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశారు గుంటూరుకు చెందిన గురు ప్రసాద్‌ అనే వ్యక్తి..

Read Also: Bombay High Court: బక్రీద్ సందర్భంగా అనుమతి లేకుండా జంతువులను బలి ఇవ్వకూడదు..

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో వీరి పరిచయం మొదలైంది.. తాను బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నానంటూ సదరు యువతితో మాటలు కలిపాడు గురుప్రసాద్‌.. అలా వారి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.. కంత్రీ మైండ్‌తో ఉన్న గురుప్రసాద్‌.. తన ప్లాన్‌ ప్రకారం.. పెళ్లి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.. త్వరలోనే పెళ్లి చేసుకుందామని నమ్మించాడు.. యువతి కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండడంతో.. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అయితే.. బాగానే ఉంటుందని నమ్మింది.. ఇక, ఆ యువతి నుంచి దాదాపు రూ.12 లక్షల వరకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొఖం చాటేశాడు.. తాను మోసపోయినట్టు గుర్తించిన యువతి.. ఈ ఘటనపై అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గురు ప్రసాద్ కు ఇప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.