Site icon NTV Telugu

Face Recognition : నేటి నుంచి విద్యార్థులకు ఫేస్‌ అటెండెన్స్‌ అమలు

Face Recognition

Face Recognition

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల అటెండెన్స్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను ఏపీ సర్కార్‌ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు సైతం ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ అమలు చేయాలని నిర్ణయించింది. అందుకు సన్నాహాలు కూడా చకచక జరిగిపోయాయి. అయితే.. నేటి నుంచి విద్యార్థులకు సైతం ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు విద్యార్థుల అటెండెన్స్‌లలో అవకతవకలు ఉంటుండటంతో, డిగ్రీ కాలేజీలపే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇంజనీరింగ్‌, ఫార్మా, బీఈడీ వంటి ఇతర ఉన్నత విద్య కోర్సులన్నిటికీ దశలవారీగా ఈ ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు అధికారులు.

Also Read :Y.S.Sharmila: ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడినుంచే పాదయాత్ర.. గవర్నర్ ను కలవనున్న షర్మిల!

అయితే.. ఈ ఫేస్‌ అటెండెన్స్‌ ప్రక్రియను గత రెండు వారాలుగా డిగ్రీ కళాశాలల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ఫేస్‌ అటెండెన్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను కళాశాలల ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు పంపారు అధికారులు. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులతో పాటు విద్యార్థుల రిజిస్ర్టేషన్‌ను పూర్తి చేశారు అధికారులు. అయితే.. ఇటీవల కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు మినహా విద్యార్థులందరి రిజిస్ట్రేషన్‌ చేశారు.

Also Read : USA: అమెరికా మారదు.. పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన

విద్యార్థులను ముఖాలను పలు కోణాల్లో ఫొటో క్యాప్చర్‌ చేశారు అధికారులు. దీంతో తరగతి గదిలో ఈ యాప్‌ను ఉపయోగించి ఫొటో తీస్తే విద్యార్థుల ముఖాలను యాప్‌ గుర్తించి హాజరు నమోదు చేస్తుంది. గుర్తించలేని ముఖాలను ఎర్రర్‌గా చూపిస్తుంది. అలాంటి వారికి అధ్యాపకులు రెండోసారి రిజిస్ర్టేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిమిషాల్లో జరిగిపోయే ప్రక్రియ అని అధికారులు పేర్కొన్నారు. తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒకటి లేదా రెండు ఫొటోలతో హాజరు పడుతుందన్నారు. ఒకవేళ ఫొటో తీసే సమయానికి ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోయినా యాప్‌లో హాజరు నమోదు అవుతుందని వెల్లడించారు అధికారులు.

Exit mobile version