భారతదేశంలో తీవ్రమైన చలి కారణంగా ఇంధనానికి డిమాండ్ తగ్గింది. దీంతో డిసెంబర్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గినట్లు ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీల ప్రారంభ విక్రయాల డేటా నుండి ఈ సమాచారం అందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 2023 డిసెంబర్‌లో 1.4 శాతం తగ్గి 27.2 లక్షల టన్నులకు చేరుకోగా, డీజిల్ డిమాండ్ 7.8 శాతం తగ్గి 67.3 లక్షల టన్నులకు చేరుకుంది.
Read Also: DK Shivakumar: నన్ను రాజకీయంగా తొక్కేయ్యాలని కేంద్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది..
ఉత్తర భారతదేశంలో చల్లటి వాతావరణం ప్రారంభం కావడంతో వాహనాల్లో ఎయిర్ కండిషనింగ్‌కు డిమాండ్ తగ్గింది. దాని కారణంగా ఇంధన వినియోగం కూడా తగ్గింది. ఈ క్రమంలో.. పెట్రోల్ విక్రయాలు నెలవారీ ప్రాతిపదికన 4.9 శాతం తగ్గాయి. అంతకుముందు నవంబర్‌లో 28.6 లక్షల టన్నులు వినియోగించారు. అంటే.. డీజిల్ వినియోగం 7.5 శాతం తగ్గింది. భారతదేశంలో అత్యధికంగా వినియోగించబడే ఇంధనం డీజిల్. ఇది మొత్తం పెట్రోలియం ఉత్పత్తులలో 40 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలోని మొత్తం డీజిల్ విక్రయాల్లో రవాణా రంగం వాటా 70 శాతం అయితే.. గత కొన్ని నెలలుగా దేశీయంగా ఇంధన వినియోగం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్‌లో పెట్రోల్, డీజిల్ రెండింటికీ డిమాండ్ పెరిగినప్పటికీ, నవంబర్‌లో డీజిల్ వినియోగం 7.5 శాతం తగ్గింది.
Also: Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్..!
విమానాల్లో ఉపయోగించే ఇంధనం ఏటీఎఫ్ విక్రయాలు.. డిసెంబర్‌లో వార్షిక ప్రాతిపదికన 3.8 శాతం పెరిగి 6,44,900 టన్నులకు చేరుకున్నాయి. అయితే ఇది 2019 డిసెంబరు నాటి ముందు కంటే 6.5 శాతం తక్కువ. అటు.. వంట గ్యాస్ (ఎల్‌పిజి) అమ్మకాలు డిసెంబర్ లో వార్షిక ప్రాతిపదికన 27.3 లక్షల టన్నుల వద్ద దాదాపు స్థిరంగా ఉన్నాయి. నెలవారీ ప్రాతిపదికన.. నవంబర్‌లో LPG డిమాండ్ 25.7 లక్షల టన్నుల LPG వినియోగంతో పోలిస్తే 6.2 శాతం పెరిగింది.