Extramarital Affair: ఈ మధ్యకాలంలో భారతదేశంలో అనేక వివాహేతర సంబంధాలకు సంబంధించిన విచిత్ర ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ మహిళ తన అక్రమ సంబంధానికి అర్థం వస్తున్నాడని భర్తను ముక్కలుగా చేసి డ్రమ్ములో పాతి పెట్టగా.. మరో మహిళ తన కూతురిని వివాహం చేసుకోబోయే వ్యక్తితో పారిపోవడం వంటి అనేక ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కోవలోకే తాజాగా మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. 50 సంవత్సరాల పైన ఉన్న మహిళ 30 ఏళ్ల యువ వ్యక్తితో ఇంటి నుంచి పారిపోయింది. అంతేకాదండోయ్.. ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది కూడా.. మరి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్కార పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్‌నగర్ ప్రాంతంలో చంద్రశేఖర్, ఇంద్రావతి ఇరువురు జంటగా నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో బతుకు పోరాటం కోసం చంద్రశేఖర్ వేరే ఊరిలో పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అలా పని చేసి కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఇంటికి పంపేవాడు. ఇకపోతే, గడిచిన వారం రోజుల క్రితం ఇంద్రావతి ఊరిలో కనిపించకుండా పోయిందన్న విషయం చంద్రశేఖర్ కు తెలిసింది. దాంతో అతడు వారి సొంత గ్రామానికి తిరిగి వచ్చి అసలు విషయం తెలుసుకొని ఆశర్యపోయాడు.
ఇక వారి ఇంటి దగ్గర 30 ఏళ్ల వ్యక్తి ఆజాద్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని.. వారిద్దరూ కలిసి తనని చంపాలనుకున్నారని, అది కుదరకపోవడంతో ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తన భార్యకు ఇది మూడో పెళ్లని తాను రెండో భర్తనని తెలిపారు. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత, తాను పెళ్లి చేసుకున్నానని అప్పటికే ఆమెకి ఓ కుమార్తె కూడా ఉందని.. తనతో పెళ్లి అయిన తర్వాత ఓ కూతురు, ఇద్దరు కొడుకులు పుట్టారని తెలిపారు.
ఇక మొదటి భర్త కూతురి పెళ్లి కోసం తన సొంత పొలాన్ని తాకట్టు పెట్టి పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. అయితే, తనపై తన భార్యకు ఆసక్తి తగ్గింపోయిందని.. సరిగా మాట్లాడేది కాదని, ఎప్పుడు గొడవలు పడేదని తెలిపారు. తన భార్య, ప్రియుడు తనని చంపాలి అనుకున్నారని.. అది జరగకపోవడంతో వారు పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక తన దృష్టిలో చనిపోయిందని.. హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తికి 13వ రోజు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అయితే, ఆమె మొదటి భర్త కూతురు కోసం తాకట్టు పెట్టిన పొలం డబ్బులు తన ఇచ్చేయాల్సిందే అంటూ పేర్కొన్నాడు. ఈ విషయంలో పోలీసులు ఏమి చేయలేకపోయారని సమాచారం.
