Site icon NTV Telugu

Extra Ordinary Man OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎక్స్‏ట్రా ఆర్డినరీ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Untitled Design

Untitled Design

నితిన్‌ హీరోగా, వక్కంతం వంశీ తెరకెక్కించిన సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో యువ హీరోయిన్ శ్రీలీల కథానాయిక కాగా.. సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా విడుదల కావడం మైనస్ అయింది. నితిన్‌ నటన, వినోదం.. శ్రీలీల డాన్స్, సాంగ్స్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌కి హైలెట్ అయ్యాయి. ఇప్పుడీ యాక్షన్‌, కామెడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.

Also Read: MS Dhoni Fan: ఎంఎస్ ధోనీ వీరాభిమాని ఆత్మహత్య!

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమా జనవరి 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గత అర్దరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసేయ్యోచ్చు. ‘నా పేరు సూర్య’ తర్వాత దర్శకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కించిన రెండో సినిమా ఇది. భీష్మ, రంగ్‌ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం ఫ్లాఫుల తర్వాత నితిన్ చేసిన సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌. ఈ సినిమా అటు వంశీకి, ఇటు నితిన్‌కు నిరాశే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

Exit mobile version