NTV Telugu Site icon

Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఎక్కడ స్ట్రీమింగంటే?

Extraordinary

Extraordinary

టాలివుడ్ యంగ్ హీరో నితిన్, సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వంక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అనుకున్న పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు.. స్టార్ హీరో నితిన్ పాత్ర జనాలకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది.. దాంతో అనుకున్న హిట్ ను అందుకోలేక పోయింది..

ఇక సీనియర్‌ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో క్యామియో అప్పియరెన్స్‌ ఇచ్చారు. హారీస్‌ జైరాజ్‌ సంగీతం, కామెడీ వంటివి అన్నీ కు మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ మూవీ.. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు.. ఫ్యాన్స్ కు ఈసారి కూడా నిరాశే మిగిలింది..

ఇక ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేక పోయిన ఓటీటీ లో ఆకట్టుకుంటుందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. ఈ సినిమా ఓటీటీ విషయానికొస్తే.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటికి వచ్చింది అనేదే ఈ న్యూస్. అకార్డింగ్‌ టూ ఫిల్మ్ రిపోర్ట్‌… ఎక్స్‌ట్రా ఆర్డిరనీ మ్యాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ ఓటీటీలో స్ట్రీమ్‌ కానున్నట్లు సమాచారం..