Site icon NTV Telugu

Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

Manish Sisodia

Manish Sisodia

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు జూలై 6 వరకు పొడిగించింది. లిక్కర్ స్కాం సీబీఐ కేసులో అనుబంధ చార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేకంగా విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనీష్ సిసోడియాను కోర్టు విచారణకు హాజరయ్యారు. మనీష్ సిసోడియాను వీసీ ద్వారా లోకప్ ఆఫ్ రూస్ అవెన్యూ కోర్టు నుంచి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్బంగా నిందితులకు చార్జిషీటు కాపీ, సంబంధిత పత్రాల కాపీని ఇవ్వాలని సీబీఐని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.

Also Read : Bhatti vikramarka: అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పారు.. హరీశ్‌ రావు పై భట్టి సెటైర్

మనీష్‌ సిసోడియా, గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్‌ పాండే, అమన్‌దీప్‌ దాల్‌లను నిందితులుగా సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్‌లో పేర్కొనింది. మనీష్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్‌దీప్ ధల్‌లకు మే 27న రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేయగా.. అయితే ఇవాళ లిక్కర్ స్కాం కేసులో నిందితుడైన అర్జున్ పాండే కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మనీష్ సిసోడియాకు చెందిన ఇద్దరు న్యాయవాదులు, అతని స్నేహితులలో ఒకరిని రౌస్ అవెన్యూ కోర్టు లాకప్‌లో కలవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 6 కి వాయిదా వేస్తున్నట్లు రౌన్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే పలువురుని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే.. తాజాగా లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు.

Also Read : Srikanth Addala: ‘పెద కాపు’… ఈ టైటిలే రచ్చ లేపేలా ఉంది!

Exit mobile version