Site icon NTV Telugu

Explosion in a factory : డోన్ మండలంలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్

Done

Done

Explosion in a factory : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలంలో భారీ పేలుడు సంభవించింది. అమిష్ క్రాప్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. పేలుడు శబ్ధానికి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రియాక్టర్ పేలిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెస్టిసైడ్ కు సంబంధించిన కారు టాప్ ప్రొడక్ట్ ను తయారు చేసే ప్రక్రియలో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు.

Read Also: MLA Rajasingh: కేటీఆర్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి: ఉషా బాయ్

ఇప్పటి కే జిల్లాలో కురుస్తున్న వానలకు ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఉడుములపాడు వద్ద ఉన్న జగనన్న కాలనీ ముంపునకు గురైంది. రాత్రి కురిసిన వర్షంతో సమీపంలోని వాగు పొంగి వరద కాలనీలోకి చేరింది. నిర్మాణాల మధ్య నిలిచిన నీటిలో స్థానికులు చేపలు పట్టుకున్నారు. చిన్న పాటి వర్షానికే కాలనీలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందిపడ్డారు. ఇక్కడ 1500మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అందులో 1202మంది నిర్మాణాలు మొదలుపెట్టారు. వానతో జనం ఇప్పంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు అకస్మాత్తుగా సంభవించిన పేలుడు దాటికి బిక్కుబిక్కుమంటున్నారు.

Exit mobile version