Site icon NTV Telugu

Yadadri Bhuvanagiri: ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో పేలుడు.. ముగ్గురు మృతి

Fire

Fire

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోటకొండూరు మండలంలోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నలుగురు కార్మికులు గాయపడ్డారు. మరో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read:Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వందే!

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు.. ఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఇద్దరి మృతదేహాలు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేసీబీ సహాయంతో శిథిలాల్లో చిక్కుకున్న వారికోసం గాలింపు చేపట్టారు. కార్మికుల మృతితో గ్రామస్తులు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

Exit mobile version