NTV Telugu Site icon

Solar Eclipse 2024: అమెరికాలో సూర్యగ్రహణం దెబ్బకి భారీగా రోడ్డు ప్రమాదాలు..!

Grahanam

Grahanam

ఇవాళ సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తు్న్నారు. నేటి (ఏప్రిల్‌ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. 2017 సూర్య గ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు దాదాపు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Read Also: Kajal kartheeka : వణికించడానికి కాజల్ కార్తిక మీ ఇంటికే వచ్చేస్తోంది గెట్ రెడీ!

2017లో వివిధ ప్రాంతాల నుంచి సూర్యగ్రహణం చూసేందుకు వచ్చిన వారి సంఖ్య కోటి 20 లక్షల మంది కంటే ఎక్కువగా ఉంది.. కానీ, ఈసారి గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండటంతో మొత్తం 31.6 మిలియన్ల మంది ప్రజలు దీనిని చూసేందుకు వస్తారని నాసా అంచనా వేసింది. అయితే, గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతాయి.. గ్రహణానికి ముందు.. అంటే, గ్రహణం పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, ఆ తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే టైంలో రోడ్లపై ట్రాఫిక్‌ భారీగా పెరిగిపోతుందని చెబుతున్నారు.

Read Also: Vassishta: ధర్మ యుద్ధం మొదలు ఇక విశ్వంభర విజృంభణమే.. కాకరేపుతున్న డైరెక్టర్ పోస్ట్

అయితే, ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది అని నిపుణులు అంటున్నారు. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుందన్నారు. ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత గణంకాలు చెబుతున్నాయన్నారు. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా.. ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనపడనుంది. దీంతో ఈ గ్రహణాన్ని వీక్షించేందుకు భారీగా వెళ్లనున్నారు. కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడాలో కనిపించనుంది. అయితే, భారత్‌లో దీని ప్రభావం ఉండదు. భారత కాలమాన ప్రకారం ఇవాళ రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారు జామున 2. 22 గంటల వరకు గ్రహణం ఉంటుంది.