ఎస్ఎల్‌బీసీటన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సొరంగం మధ్యలో ఒక ఎస్కేపింగ్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎదురవుతున్న ఆటంకాలపై NGRI శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో.. యాడిట్ ఏర్పాటుపై అధికారులు చర్చిస్తున్నారు. తిర్మలాపూర్ సమీపంలో ఏర్పాటుకు వెసులుబాటు ఉంది. 1994 ఏప్రిల్ 22న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. కాగా.. ద్వారంతో టన్నెల్ తవ్వకం సులభమయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: Sridhar Babu: పాఠ్యాంశాలు మార్చాలి.. విద్యా వ్యవస్థ ముఖచిత్రం మారాలి
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, పులుల అభయారణ్యం కావడంతో యాడిట్ ఏర్పాటుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు లభించాయి. 30 ఏళ్ల కిందటే యాడిట్ తవ్వకానికి కేంద్రం అనుమతి రాగా.. 1994 ఏప్రిల్ 22న పర్యావరణ అనుమతి కూడా వచ్చింది. అమ్రాబాద్ మండల పరిధి తిర్మలాపూర్ సమీపంలో ఆదిమజాతి గిరిజనులు నివాసముండే ప్రాంతంలో యాడిట్ ఏర్పాటు చేయనున్నారు. టన్నెల్ మధ్యలో 25 కిలోమీటర్ల వద్ద యాడిట్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. టన్నెల్ తవ్వకం పూర్తయ్యాక ఇన్‌లెట్, ఔట్‌లెట్ నుంచి తవ్వుకుంటూ వచ్చే TBMలను తవ్వి కప్పేయాలి. యాడిట్ ఏర్పాటుతో TBMలను బయటకు తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది. దీంతో.. టన్నెల్ తవ్వకం కూడా మరింత సులభతరం అవుతుంది.
Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి!
కాగా.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి.