NTPC మైనింగ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. CA లేదా CMA ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎన్విరాన్‌మెంట్ సబ్జెక్టులో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు మైన్ సర్వే, మైనింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.
Also Read:IND vs AUS: టీమిండియా కొంప ముంచిన వరణుడు.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి 30 సంవత్సరాలు, ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్) అభ్యర్థులకు 35 సంవత్సరాలు, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి 40 సంవత్సరాలు వయో పరిమితి ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సీబీటీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్), ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 71,000, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 జీతం అందిస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 15, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
