నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్లో వచ్చిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో అద్భుతమైన ప్రేమ కథతో హాయ్ నాన్న ప్రేక్షకులను మెప్పించి భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ప్యారడైజ్ షూట్ ఫినిష్ అవగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
Also Read : Allu Sirish : ‘మగజాతి ఆణిముత్యం’గా అల్లు శిరీష్.. దర్శకుడు ఎవరంటే?
నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో మరో సినిమాను అనౌన్స్ చేసాడు. వీటితో పాటు ‘హిట్ 4’ షూటింగ్ పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు నాని. ఈ బిజీ షెడ్యూల్ వలన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శౌర్యువ్ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడని సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని శౌర్యువ్ ప్లాన్ చేశారు. ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ కాంబోపై అంచానాలు పెట్టుకున్నారు. కానీ నానికి ఉన్న ఇతర కమిట్మెంట్స్ వలన శౌర్యువ్ సినిమాని క్యాన్సిల్ చేసేసాడు. మరి శౌర్యువ్ ఈ కథని ఏ హీరోతో చేస్తాడో చూడాలి.