Site icon NTV Telugu

Excitel Offer: సూపర్ ఆఫర్.. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తో టీవీ ఫ్రీ

Excitel

Excitel

Free Tv and Android Projector With Excitel Broad Band Connection : ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు హైస్పీడ్ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు అన్ లిమిటెడ్ డేటా అలాగే పలు ఓటీటీ ఛానెల్స్ కు యాక్సెస్ ను అందిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇచ్చే ఆఫర్స్ కు మించి ఒక అడుగు ముందుకేసింది ‘ఎక్సైటెల్’. బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు ఉచిత టీవీ లేదా ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ను అందిస్తుంది. బిగ్ స్క్రీన్ ప్లాన్స్ పేరుతో రెండు రకాల ప్లాన్లను ప్రకటించింది ఎక్సైటెల్. రూ.1,299 ప్లాన్ లేదా రూ.1,499 తీసుకునే వారు వీటిని పొందటానికి అర్హులు. అయితే ఇలాంటి ఆఫర్ ను ఎక్సైటెల్ ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రయోగత్మకంగా చేసింది. అది మంచి ఫలితాన్ని ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా 35 నగరాల్లో ఈ ఆఫర్ ను తీసువస్తుంది. ఈ రెండు ప్లాన్లను నో కాస్ట్ ఈఎంఐ తో అందిస్తుంది సంస్థ. ఈ విషయంపై కంపెనీ సీఓఓ వరుణ్ పస్రిచా మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ లో స్మార్ట్ టీవీ ఆఫర్ అందించినట్లు తెలిపారు. అది విజయవంతం కావడంతో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఈ ఆఫర్ తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఒకసారి చేస్తే అది ఎక్స్ ఫెరిమెంట్ అని, రెండో సారి చేస్తే అది కమిట్మెంట్ అని, ఎప్పుడూ చేస్తే అతి రెస్పా్న్స్ బిలిటి అని ఈ ఆఫర్ అందించడం కంపెనీ తన బాధ్యత భావిస్తుందని తెలిపారు.

Also Read: Viral Video: భలే పిట్ట గురూ ఇది.. దొంగతనం చేసి యజమానికి ఇస్తున్న పక్షి

బిగ్ స్క్రీన్ ప్లాన్స్ తీసుకునే వారికి సంస్థ స్మార్ట్ టీవీతోపాటు పలు ఇతర సదుపాయాలను కూడా ఉచితంగా కల్పిస్తోంది. వివరాల ప్రకారం రూ.1,299 ప్లాన్ తో 400 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ సేవలు పొందటంతో పాటు 16 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. అంతేకాకుండా 550 లైవ్ టీవీ ఛానళ్ల సేవలను ఉచితంగా పొందొచ్చు. ఇక దీనితో పాటు కంపెనీ ఫ్రీ వైబర్ 32 అంగుళాల హెచ్ డీ క్లౌడ్ టీవీని అందిస్తుంది. ఇక రూ.1,499 ప్లాన్ లోనూ 400 ఎంబీపీఎస్ వేగంతో, అపరిమిత డేటా పొందవచ్చు. పైన తెలిపిన ప్లాన్ లో లాగానే 16 ఓటీటీల సబ్ స్క్రిప్షన్, 550 లైవ్ టీవీ ఛానళ్ల సేవలను పొందొచ్చు. ఈ ప్లాన్ తీసుకునే వారికి ఈగేట్ కే9 ప్రో మ్యాక్స్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ఉచితంగా లభిస్తుంది. అయితే టీవీకానీ , ప్రొజెక్టర్ కానీ మొదటి నెల బిల్లు చెల్లించిన తరువాత 7 నుంచి 10 రోజుల్లో లభిస్తాయి. కొత్త సబ్ స్క్రైబర్ చేసుకున్న వారు కానీ, అంతకముందే ఈ వైఫైని వాడుతున్న వారు కానీ ఎవరైనా ఈ ఆఫర్ ను పొందవచ్చు.

 

Exit mobile version