Site icon NTV Telugu

Excise Task Force Police: కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు..

Kallu

Kallu

హైదరాబాద్ లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూడు టీములుగా ఏర్పడి మూడు వేరు వేరు ప్రాంతాల్లో దాడులు చేశారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసుల దృష్టిసారించారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శేర్లింగంపల్లి సిద్దిక్ నగర్ లో కల్లు కాంపౌండ్ పై దాడి చేశారు. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

Also Read:IND vs ENG: రిషబ్ పంత్ నయా హిస్టరీ.. వివ్ రిచర్డ్స్ రికార్డు బద్దలు

కల్లు కాంపౌండ్ సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లపై తనిఖీలు నిర్వహించి కల్లు కాంపౌండ్ లో ఉన్న పలు శాంపిల్స్ సేకరించారు. ముషీరాబాద్ లో మూడు, కాచిగూడలో రెండు కల్లు డిపోలపై ఎక్సైజ్ తనిఖీలు చేపట్టింది. హైదరాబాదులో కల్లు కాంపౌండ్స్ లో సేకరించిన శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించారు ఎక్సైజ్ అధికారులు..

Also Read:Shreya Dhanwanthary : ముద్దు సీన్ తీసేస్తారా.. సెన్సార్ బోర్డుపై నటి ఫైర్..

తనిఖీల సమయంలో కల్లు కాంపౌండ్ నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. డిపోల నుంచి వచ్చే కల్లును మాత్రమే స్టోరేజ్ చేసి విక్రయించాలని ఆదేశించారు. కల్లులో ఎలాంటివి కలిపిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం.. అల్ప్రోజలం లాంటివి మత్తు కోసం కలిపితే నేరం.. నిబంధనలకు విరుద్ధంగా ఏది చేసిన ఉపేక్షించేది లేదు… ఒక్కసారి ఇలాంటివి చేసి పట్టుపడితే పర్మినెంట్ గా లైసెన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు.

Exit mobile version