NTV Telugu Site icon

Gupta Nidhulu: విశాఖలో గుప్త నిధుల కలకలం..

Guptha Nidhulu

Guptha Nidhulu

విశాఖపట్నంలో లంకే బిందలు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాటి చెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్ లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వినట్లు ఆనవాళ్లు లభించాయి. రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 20 అడుగులు గొయ్యి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. గుప్త నిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తులు? ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also: Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. జలమయంగా మారిన రహదారులు!

అయితే, నెల రోజుల నుంచి పూజల మాటున తవ్వకాలు జరుగుతున్నాయి. చుట్టూ పరదాలు కప్పి, రాత్రుళ్ళు దేవుడు పాటలు పెట్టుకొని కోటేశ్వరరావు చుట్టూ పక్కల వాళ్ళని ఏమార్చాడు. ఇక, ఈ విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళలు వేసి మహిళలు పరారు అయ్యారు. దోష నివారణ కోసం పూజలు చేసామంటూ సదరు వ్యక్తులు చెబుతున్నారు. స్వామిజీ చెప్పినట్లు చేస్తున్నాను అని కోటేశ్వరరావు అనే వ్యక్తి తెలిపాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.

Show comments