యుజ్వేంద్ర చాహల్.. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని క్లిష్టతరం చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో అతడి సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో అదరగొడుతుండగా చాహల్ మాత్రం వెనుకబడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో (వన్డేలు, టీ20లు కలిపి) అతడు కేవలం రెండింటిలోనే ఆడాడు. దీంతో అతడి ఫామ్‌పై మాజీలు కూడా విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి.. చాహల్ ఫామ్‌పై స్పందించాడు.
Also Read: PM Modi: ప్రధాని మోడీ విదేశీ ప్రయాణాల ఖర్చెంతో తెలుసా?
“సుదీర్ఘ కెరీర్‌లో ప్రతి బౌలర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాడు. ప్రస్తుతం చాహల్ కూడా అదే ఫేజ్‌లో ఉన్నాడు. మిడిల్‌లో చాహల్ లాంటి బౌలర్లకు గేమ్ టైమ్ దొరకపోతే బహుశా దేశవాలీ క్రికెట్‌లోనైనా ఆడతానని జట్టు మేనేజ్‌మెంట్‌ను అడగాలి. ఎందుకంటే ఈ సమయం అతడు తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఉపయోగపడుతుంది. చాహల్‌కు అదే మంచి ప్రిపరేషన్. నేను ఈ రోజు బాగా ఆడాను. కొంచెం రిలాక్స్ అవుతాను అనుకోవచ్చు. కానీ ఆ సమయమే మీపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంటుంది. ఈ విషయంపై చాహల్ కూడా ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా బంతి ఫాలో త్రూపై దృష్టి సారించాలి. అతడి ఆర్మ్ స్పీడ్ ఎక్కువ. కాబట్టి బంతిని స్పిన్ చేయడం చాలా ముఖ్యం. కొన్ని సార్లు అతడు బంతిని పుష్ చేయడం వల్ల దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు” అని సునీల్ తెలిపాడు.
Also Read: Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో నెయ్యి, వంట నూనెల కొరత..
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.