Site icon NTV Telugu

Mumbai: ముంబైలో కాల్పుల కలకలం.. శివసేన నేత కుమారుడిపై ఫైరింగ్

Mum Fie

Mum Fie

ముంబైలో (Mumbai) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇటీవలే ఓ బీజేపీ ఎమ్మెల్యే.. శినసేన వర్గానికి చెందిన గుంపుపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన భయాందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శివసేన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అభిషేక్ ఘోసల్కర్‌పై (Abhishek Ghosalkar) కాల్పులకు తెగబడ్డారు. ప్రాథమిక వివరాల ప్రకారం మొత్తం మూడు బుల్లెట్లు పేలాయి. పరస్పర వివాదాల కారణంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అభిషేక్ ఘోసల్కర్‌ మాజీ కార్పొరేటర్‌.. ప్రస్తుతం అతనిని రీజియన్‌లోని కరుణ ఆస్పత్రిలో చేర్చారు.

ఇటీవల మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్.. శివసేన నాయకుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది. గణపత్ గైక్వాడ్‌ను ఉల్హాస్‌నగర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా.. ఫిబ్రవరి 14 వరకు పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో భూ వివాదంపై ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Exit mobile version