Site icon NTV Telugu

Mumbai: ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే కాల్పులు.. ముంబైలో కలకలం

Facebook

Facebook

ముంబైలో (Mumbai) కాల్పులు కలకలం సృష్టించాయి. శివసేన నాయకుడు వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభిషేక్ ఘోసల్కర్‌పై (Abhishek Ghosalkar) ఫైరింగ్ జరిగింది. మౌరిస్ భాయ్ అనే వ్యక్తి కాల్పులు జరపడంతో అభిషేక్ మరణించాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రికి తరలించిన కొన్ని నిమిషాలకే అభిషేక్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉంటే నిందితుడు కూడా తనకు తానుగా కాల్చుకుని మౌరిస్ భాయ్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు వివాదాలే కారణంగా తెలుస్తోంది.

MHB పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరివలి ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం మూడు బుల్లెట్లు పేలాయి. ఇరువురి మధ్య వాగ్వాదం కారణంగానే ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అభిషేక్ ఘోసల్కర్ మాజీ కార్పొరేటర్. కాల్పులు జరగడంతో రీజియన్‌లోని కరుణ ఆస్పత్రిలో చేరారు. అతని తండ్రి వినోద్ ఘోసల్కర్. 2009 నుంచి 2014 వరకు మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న శివసేన నాయకుడు. వినోద్ ఘోసల్కర్ గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు.

Exit mobile version