Site icon NTV Telugu

Pension for 66years : 66ఏళ్ల పాటు పింఛన్ తీసుకున్న తాత కన్నుమూత

Boytram Dudi Passes Away

Boytram Dudi Passes Away

Pension for 66years : తన జీవితంలో 66ఏళ్ల పాటు ప్రభుత్వం నుంచి పింఛన్ అందుకున్న వ్యక్తి కన్నుమూశాడు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్‌ అందుకున్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పదేండ్లకు అంటే 1957లో ఆయన ఆర్మీ నుంచి రిటైర్‌ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ప్రతినెల పెన్షన్‌ అందుకుంటున్నారు. 1957లో రూ.19 తో ప్రారంభమైన పింఛన్‌.. ఆయన మరణించేనాటికి రూ.35,640కి చేరింది.
Read Also: IDJN : ఇక నుంచి జనవరి 31న అంతర్జాతీయ దళిత మీడియా దినోత్సవం
అత్యధిక కాలం పింఛన్‌ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్‌రామ్‌ దుడి(100) కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝునుకు చెందిన బోయత్‌రామ్‌ స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ గా పనిచేశారు. ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్‌ అందుకున్నారు. బోయత్‌రామ్‌ తన 17 ఏండ్ల వయస్సులో ఆర్మీలో జాయిన్‌ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో లిబియా, ఆఫ్రికాలో పనిచేశారు. ఇప్పుడు ఆయన సతీమణి చందా దేవి సైనా (92) తాను బతికున్నంత కాలం పెన్షన్‌ అందుకోనున్నారు.
Read Also:TSRTC : హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి మరో సర్వీస్‌

Exit mobile version