NTV Telugu Site icon

Harsh Kumar: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై గవర్నర్ కు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫిర్యాదు

Harsha Kumar

Harsha Kumar

విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మాజీ ఎంపీ హర్షకుమార్ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై గవర్నర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఇక, మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం గేమ్ ఆడుతుంది.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించి వాటిని నవరత్నాల పేరుతో ప్రచారం చేస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్లించి వారిని అభివృద్ధి చేశామని జగన్ చెప్పడం ఎంటి? అని ఆయన ప్రశ్నించారు. అమ్మఒడితో పాటు పలు పథకాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులే మళ్లిస్తున్నారు.. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు నిధులు కేటాయించడం లేదు.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు పూర్తిగా నష్ట పోతున్నారు అని హర్షకుమార్ ఆరోపించారు.

Read Also: CI Beat The Constable: ఇక్కడేం పని నీకు.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‍పై సీఐ లాఠీఛార్జ్..

వైఎస్ఆర్ వచ్చే వరకు స్కాలర్షిప్ లు ఇచ్చేవారు.. ఆ స్థానంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇస్తున్నారంటూ హర్షకుమార్ తెలిపారు. స్కాలర్ షిప్ లను జగన్ ప్రభుత్వం ఈరోజు పక్కన పెట్టేసింది.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు.. ఏపీలో మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్ముకుంటున్నారు.. ప్రభుత్వ విధానం వల్ల అందరూ రిజర్వేషన్ ఫలాలు నష్టపోతున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలకు జరుగుతున్న నష్టాన్ని గవర్నర్ కు వివరించామని ఆయన చెప్పుకొచ్చారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం బడ్జెట్లో ప్రతిపాదనపెట్టి బడ్జెట్ నిధులతో ఏర్పాటు చేయాలి.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం తప్పు అని మాజీ ఎంపీ హర్షకుమార్ చెప్పుకొచ్చారు.

Show comments