NTV Telugu Site icon

Ex Mp Humanity: మాజీ ఎంపీ మానవత్వం.. మహిళను కాపాడిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్

Mp Boora

Mp Boora

Dr Boora Narsaiah Goud Humanity: ఒక్కోసారి రోడ్డుమీద వెళ్ళేటప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కొందరు మనకెందుకులే అని వాటిని వదిలేస్తారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాపాయస్థితిలో వుంటే అసలు పట్టించుకోరు. ఒకవేళ వారిని ఆస్పత్రికి చేరిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని జనం వదిలేస్తారు. కానీ కొందరు అలా కాదు.. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే.. ప్రమాదాల బారిన పడితే వెంటనే స్పందిస్తారు. అందునా ఒక డాక్టర్ గా ఉన్న రాజకీయ నాయకుడు అయితే.. వైద్యం కూడా అందిస్తారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది.

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్వయానా ఒక డాక్టర్. రాజకీయ నాయకుడిగానే కాదు డాక్టర్ గా ఎందరికో వైద్యం అందించారు. తాజాగా ఆయనలో ఆ డాక్టర్ బయటికి వచ్చారు. ఒక మహిళ ప్రాణం కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం పట్టణంలో నాగార్జున సాగర్ హైవేపై ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది ఒక మహిళ. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయంతో స్పృహ కోల్పోయింది.

ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వెంటనే స్పందించారు. ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి క్షేమంగా తరలించి ప్రాణాలను కాపాడి వృత్తి ధర్మాన్ని పాటించారు. రాజకీయ వేత్తగానే కాదు మంచి డాక్టర్ గా భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నిరూపించుకున్నారు. సకాలంలో స్పందించి మానవత్వం చాటుకున్న బూరనర్సయ్య గౌడ్ ని అంతా అభినందిస్తున్నారు.

Read Also: Flying Bike : త్వరలో మార్కెట్లోకి గాల్లో తేలే బైకులు.. ధర ఎంతంటే

Show comments