Site icon NTV Telugu

Hemant Soren: ఈరోజు జార్ఖండ్ హైకోర్టులో హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!

Hemanth

Hemanth

Land scam case: భూ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ పిటిషన్‌పై జార్ఖండ్ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈడీ తన సమాధానం దాఖలు చేయడానికి సమయం కోరింది. కోర్టులో ఈ కేసు తదుపరి విచారణ జూన్ 10కి షెడ్యూల్ చేయబడింది. సోరెన్ తరపున హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. అంతేకాకుండా, హైకోర్టును కూడా త్వరగా విచారించాలని అభ్యర్థించారు. ఈడీ అభ్యర్థనను స్వీకరించిన హైకోర్టు నేటి విచారణను వాయిదా వేసింది.

Read Also: OG : ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం పవన్ అన్ని రోజులు కష్టపడ్డారా..?

కాగా, మే 13వ తేదీన ఈడీ కోర్టు హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బద్గై ప్రాంతంలోని 8.86 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించిన కేసులో ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నాడు. ఈ కేసులో హేమంత్ సోరెన్ ఏప్రిల్ 15న ఈడీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విన్న ఈడీ కోర్టు తన నిర్ణయాన్ని మే 4న రిజర్వ్ చేసింది. కాగా, సోరెన్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఈడీ తరఫున లాయర్లు కోర్టులో పేర్కొన్నారు. అయితే, మాజీ సీఎం తరపు న్యాయవాది వాదిస్తూ.. మనీలాండరింగ్ కేసు అతనిపై నమోదు చేయబడలేదని చెప్పారు. ఏ విధమైన లావాదేవీకి ప్రత్యక్ష ఆధారాలు లేవు అని పేర్కొన్నారు. ఇక, అంతకు ముందు మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన అరెస్టును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కూడా కోరారు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో హేమంత్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Exit mobile version