NTV Telugu Site icon

Ram Yogi Velagapudi : కంటెంట్ కొత్తగా ఉంటే నెత్తిన పెట్టుకుంటారు..నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

Evol

Evol

ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలల్లో చిన్న సినిమాలే భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ ఏడాది వచ్చిన హనుమాన్ సినిమా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తాజాగా ఎవోల్ దర్శక నిర్మాత ఈ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రేక్షకులు సినిమాలను ఎలా చూస్తారు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఎవోల్ సినిమా ప్రెస్ మీట్ ను ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు.. ఈ సందర్బంగా దర్శక నిర్మాత రామ్‌ యోగి వెలగపూడి మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.. అలాంటి కొత్త ధనాన్ని ఈ సినిమాలో చూస్తారని ఆయన అన్నారు..

సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా ఎవోల్ ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్.. గతంలో విడుదల చేసిన ఓ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.. తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్‌, నేపథ్యంలో సాగే కథ పై సినిమా రాబోతుంది.. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు..