NTV Telugu Site icon

Elections 2024: ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం..

Mulugu

Mulugu

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దంమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక, ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు. 2 లక్షల 33 వేల 191 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే, అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 62 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ సెగ్మెంట్ లో 1 మహిళా, 1 దివ్యాంగులు, 1 యూత్, 1 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read Also: Duvvuri Subbarao: ఐఏఎస్ వ్యవస్థలో నిజాయితీ తగ్గుతోంది

ఇక, ములుగు జిల్లాలో మొత్తం 87 లోకేషన్ లలో 258 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నాల్గవ విడతలో
మహబూబాబాద్ లోక్ సభ స్థానం ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి వెల్లడించారు. రేపు (మే 13న) జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నదని అన్నారు. జిల్లాలో మొత్తం 2 లక్షల 33 వేల 191 మంది ఓటర్లు ఉండగా.. 226 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.

Read Also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

కాగా, జిల్లా పరిధిలో అత్యవసర సర్వీసుల కింద ఒక్క ఓటర్ మాత్రమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా పరిధిలో ఓటర్లందరికి ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. అలాగే, ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 62 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. జిల్లాలో ఎలాంటి వల్నరబుల్ పోలింగ్ కేంద్రం లేదని వెల్లడించారు.