Site icon NTV Telugu

Ponnam Prabhakar: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి: మంత్రి పొన్నం

Ponnam

Ponnam

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి అని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరుడు.. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్నీ ఆరోగ్యంగా రక్షించుకోవాలన్న మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్న ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యత తీసుకోవాలని కోరారు.. రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలి.. పిల్లలకు ప్రతి రోజు మొక్కలకు నీళ్ళు పోసే విధంగా అలవాటు చేయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Read Also: Chandrababu Naidu-Ram Charan: చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపిన రామ్ చ‌ర‌ణ్!

అలాగే, మనం మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనల్ని రక్షిస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా చెట్లు కత్తిరించడం, మొక్కలు నాటకపోవడం, ప్లాస్టిక్ వాడడం వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది.. ఇప్పటికే కాలుష్యం పెరిగి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోవడంతో మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. తెలంగాణ ప్రతి బిడ్డా ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Exit mobile version