భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధనా, గాయకుడు-సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్‌ల మధ్య వివాహం ఆలస్యం కావడం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ 23న సాంగ్లీలో జరగనున్న వీరి వివాహం ఆకస్మికంగా ఆగిపోయింది. వివాహం జరగాల్సిన వేళ స్మృతి తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్రాయోంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. స్మృతి మంధనా, పలాష్ ముచ్ఛల్ వివాహ కథలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ పోస్ట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో, అభిమానులు మరింత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Also Read:IndiGo CEO Apology: ఇండిగో విమానాల ఆలస్యం.. క్షమాపణలు చెప్పిన సీఈఓ
వివాహం వాయిదా పడిన తర్వాత, క్రాయోంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రహస్య సందేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్ట్ లో “జీవితంలో ఆడే ప్రతి మ్యాచ్‌లో మనం ఫినిష్ లైన్‌ను దాటము, కానీ స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ ఎల్లప్పుడూ ముఖ్యం.. మా టీమ్ ఆనందం, గర్వంతో కష్టపడి పని చేసింది. వారందరిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి! ఛాంపియన్‌ను త్వరలో కలుస్తాం.” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో క్రికెట్ మెటాఫర్లు ఉపయోగించి, సంగీత్ కోరియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, స్టైలిస్టుల వంటి టీమ్ సభ్యులను ట్యాగ్ చేశారు. ఇది స్మృతి మంధనా వివాహానికి సంబంధించినదేనని అందరూ భావిస్తున్నారు. పోస్ట్ వైరల్ అవ్వడంతో, కామెంట్లలో “వివాహం జరుగుతుందా? రూమర్స్ నిజమా?” అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read:Putin’s Security: పుతిన్ సెక్యూరిటీ ఎంత ఖతర్నాక్ అంటే, టచ్ చేస్తే చావే..
స్మృతి మంధనా-పలాష్ ముచ్ఛల్ వివాహ కథ ఇప్పుడు ఒక సీరియల్‌లా మారింది. ఈవెంట్ కంపెనీ పోస్ట్ “త్వరలో కలుస్తాం” అని చెప్పడంతో, వివాహం జరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, రూమర్స్, ఊహాగానాల మధ్య రెండు కుటుంబాలు శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాయి. త్వరలో స్పష్టమైన అప్‌డేట్ రావాలని అందరూ ఎదురుచూస్తున్నారు.
