Site icon NTV Telugu

PSR Anjaneyulu: జైల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు.. కోర్టుకి తెలిపిన పీఎస్‌ఆర్‌!

Psr Anjaneyulu

Psr Anjaneyulu

విజయవాడ జిల్లా జైల్లో తనకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని కోర్టుకి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తెలిపారు. పూజకు పుస్తకాలు, పెట్టుకోవటానికి బొట్టు ఇవ్వటం లేదని జడ్జికి చెప్పారు. తాను విచారణకు సహకరిస్తున్నారని, మరోసారి కస్టడీకి తీసుకున్నా సహకరిస్తానన్నారు. జైల్లో తాను వెళ్లిన తర్వాత తన కారణంగా వేరే వారికి కూడా సౌకర్యాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైలుకి వెళ్లిన తొలి రోజున టీవీ ఉందని, వాకింగ్ వెళ్లి వచ్చేసరికి టీవీ లేదని కోర్టుకి పీఎస్‌ఆర్‌ తెలిపారు. ఈ సదుపాయాలపై పిటిషన్ వేరేగా దాఖలు చేసుకోవాలని జడ్జి సూచించారు. కస్టడీలో ఇబ్బంది పెట్టారా? అని ప్రశ్నించగా.. లేదని పీఎస్‌ఆర్‌ బదులిచ్చారు. పీఎస్‌ఆర్‌ను కోర్టు నుంచి జైలుకు తరలించారు.

Also Read: Preity Zinta : అభిమానులకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్..

ముంబై నటి కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించిన కేసులో అరెస్టయిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు.. ప్రస్తుతం సీఐడీ రిమాండ్‌లో ఉన్నారు. సీఐడీ అధికారులు మూడో రోజు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు అనంతరం సీఐడీ ఏఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పీఎస్‌ఆర్‌ను విచారిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు ఆరు గంటల పాటు సీఐడీ అధికారులు ప్రశ్నించారు. 80కి పైగా ప్రశ్నలు అడిగినా సూటిగా సమాధానం చెప్పలేదు.

Exit mobile version