ఈ మధ్య ఓటీటీ లోనే సినిమాలు బాగా రిలీజ్ అవుతున్నాయి.. థియేటర్లలో విడుదల కన్నా ఎక్కువగా ఓటీటీ లో మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఈ నెలలో ప్రముఖ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎప్పుడు విడుదల అవుతున్నాయో ఇప్పుడు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
వళరి..
రితికా సింగ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘వళరి’.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈ నెల 6 న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.. ఈ సినిమాకు సంతోషి దర్శకత్వం వహించారు. రితికతో పాటు శ్రీరామ్, ఉత్తేజ్, సుబ్బరాజు, ప్రిన్స్ సహస్ర వళరి చిత్రంలో కీలకపాత్రలు పోషించారు..
ఏం చేస్తున్నావ్..
విజయ్ రాజ్‍కుమార్, నేహా పఠాన్, అమృత రంగానాథ్ ప్రధాన పాత్రలు పోషించిన ఏం చేస్తున్నావ్ సినిమా గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే పెద్దగా ఆడలేదు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఆమని కూడా నటించారు.. ఈ సినిమా ఈ నెల 14 న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చెయ్యండి..
తులసీవనం..
వీజీ సైన్మా బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘తులసీవనం’ వెబ్ సిరీస్‍ను నిర్మించారు. తండ్రి కోరికను కాదని నటుడు కావాలనుకునే ఓ కొడుకు కథతో ఈ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్‍లో అక్షయ్ లాగుసానీ, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 21వ తేదీన ఈటీవీ విన్ లోకి రాబోతుంది..
అలాగే ప్లాట్ సినిమా గతేడాది నవంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. వికాస్ ముప్పల, గాయత్రీ గుప్తా, సజీవ్ పసల ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఈ నెల 28న ఓటీటీలో రాబోతుంది.. ఈ నెలలో ఈటీవీ విన్ లో వచ్చిన అన్ని సినిమాలు మంచి టాక్ అందుకున్నాయి…
