Site icon NTV Telugu

Etela Rajneder : గురుకులాల్లో టీచర్స్‌తో కేసీఆర్ వెట్టిచాకిరి చేయిస్తున్నారు

Mla Etela Rajender

Mla Etela Rajender

Etela Rajender Fired on TRS Government
మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ట్రిపుల్ ఐటి లోనే కాదు… అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ల్లో అదే రకమైన పరిస్థితి నెలకొందన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాసర వెళ్తున్నామని తెలిస్తే చాలు.. మమ్మల్ని మధ్యలోనే అరెస్ట్ చేస్తున్నారు ఆయన మండిపడ్డారు. గురుకులాల్లో టీచర్స్ తో కేసీఆర్ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వర్శిటీల్లోని విద్యార్థు గవర్నర్‌ను కలిసి మొరపెట్టుకున్నారని ఆయన వెల్లడించారు.

 

విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నారన్నారు. మేము చదువుకున్న రోజుల్లోనే ప్రభుత్వ బడుల్లో భోజన సదుపయాలు బాగున్నాయని, ఇప్పుడు అన్ని ఉన్నా కూడా విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నారన్నారు. ప్రజల సొమ్మును పక్కదారి పట్టించడమే తప్పా.. కనీసం విద్యార్థులు బుక్కెడు అన్నం పెట్టలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు ఈటల రాజేందర్‌.

 

Exit mobile version