Site icon NTV Telugu

హుజురాబాద్ లో కవాతు నిర్వహిస్తాం ; ఈటల రాజేందర్

కరీంనగర్ జిల్లా : జమ్మికుంటలో కవాతు చేయాలని మహిళలు కోరుతున్నారని… తప్పకుండా త్వరలోనే చేస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌. జమ్మికుంట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తనకు సపోర్ట్‌ గా ఉన్న నాయకులను పట్టండని కెసిఆర్ ప్రగతి భవన్ లో ప్లాన్ వేస్తే.. హరీశ్ రావు అమలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఈరోజు ఉన్న నాయకులు రేపు తనతో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గెలిచిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను గెలిపించింది మనం కాదా ? నా అండ వారికి లేకుండెనా ? కానీ ఇప్పుడు ఒక్కరు కూడా తనతో లేరని ఈటల అన్నారు. దసరా పండుగకు కూడా వాళ్ళే మాంసం, డబ్బులు పంపిస్తారట అంటూ టీఆర్‌ఎస్‌ పై ఫైర్‌ అయ్యారు.

Exit mobile version